పద్మనాభంలో జగనన్నకు చెబుదాం

పద్మనాభంలో జగనన్నకు చెబుదాం

ప్రజాశక్తి- పద్మనాభం : పద్మనాభం మండల కాంప్లెక్స్‌లోని వెలుగు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమానికి సంబంధించి 72 వినతులు వచ్చినట్లు స్థానిక తహశీల్దార్‌ వేణుగోపాల్‌ తెలిపారు. ఇందులో 32 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించి, 45 ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై వచ్చినట్లు వివరించారు. రేవిడి పంచాయతీ పరిధిలోని రౌతులపాలెం గ్రామానికి చెందిన పి.ఈశ్వరరావు నాలుగేళ్లుగా వికలాంగుల పింఛన్‌ అందలేదని ఫిర్యాదు చేశారు. అనంతవరం గ్రామంలో సిసి రోడ్లు, డ్రెయినేజీలు, లింకు రోడ్లు నిమిత్తం నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ జి.వెంకటలక్ష్మి వినతిపత్రం అందించారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమానికి మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో ప్రచారం లేకపోవడంతో ఫిర్యాదుదారులు ఎక్కువగా రాలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, భీమిలి ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి, ఎంపిడిఒ విజరుకుమార్‌, జిల్లాస్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️