పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Nov 30,2023 23:52

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని మురారిపల్లి సర్పంచి ఏకుల జయమ్మ ముసలారెడ్డి కోరారు. మండలంలోని మురారిపల్లి గ్రామంలో వికసిత్‌ భారత సంకల్ప యాత్ర గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలలో అవగాహన కల్పించేందుకు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర సంకల్పించినట్లు తెలిపారు. గిరిజనులు, ఆదివాసుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు,చర్యలు గురించి ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్ధేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌డిఒ బివిఎన్‌.సాయికుమార్‌, ఎంపిడిఒ వైవి. నాగేశ్వర ప్రసాద్‌, వెంకటాద్రిపాలెం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ వి.కోటా నాయక్‌, హౌసింగ్‌ ఎఇ అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రామారావు నాయక్‌, వైసిపి మండల నాయకులు ఏకుల ముసలారెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

➡️