పట్టా భూములు సద్వినియోగం చేసుకోవాలి

లీజు పట్టాలు పంపిణీ చేస్తున్న ఎంఎల్‌ఎచిట్టిబాబు, ఆర్‌డిఒ

ప్రజాశక్తి-మామిడికుదురు(పి.గన్నవరం)                                                                                                              ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పట్టా భూములను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. పి.గన్నవరం మండలం బెల్లంపూడి సర్పంచ్‌ బండి మహాలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో 61 ఎకరాల 50 సెంట్లు పెరుగులంక భూములను 184 మంది రైతులకు అయిదు సంవత్సరాల లీజుకు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ముక్కంటి, తహశీల్దార్‌, ఆర్‌ఐ, పంచాయతీ సిబ్బంది, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️