నేడు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

Nov 30,2023 21:37
స్వాగతం పలుకుతున్న పసుపులేటి హరిప్రసాద్‌

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబుతిరుమలలోనే రాత్రికి బసస్వాగతం పలికిన జిల్లా నేతలుప్రజాశక్తి – తిరుమలటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చెరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి గాయత్రి నిలయంలో బస చేశారు. తిరుమల సంప్రదాయం మేరకు శుక్రవారం ఉదయం ముందుగా వరాహస్వామి వారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. ఉదయం 7.30 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం గాయత్రి నిలయంలో కాసేపు విశ్రాంతి తీసుకుని, 9.30 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరి వెళతారు. రేణిగుంట నుంచి విజయవాడకు వెళ్లనున్నారు. డిసెంబర్‌ రెండో వారంలో తన నియోజకవర్గమైన కుప్పంలో చంద్ర బాబు పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గ విస్తరణ విభాగ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ సురేష్‌ బాబు , సభ్యులు కన్నన్‌, రాజారామ్‌, జయ రామన్న, బాలాజీ, బాబు, రామచంద్రలు చంద్రబాబును కలిసారు. చిట్టమూరు మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్‌ నాయుడు రేణిగుంట విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు. ఆయనతో పాటు గుంపర్ల చిన్నారావు, ఎస్‌కె రషీద్‌, కమతం పోలయ్య, ఆరూరు గిరిబాబు నాయులు పాల్గొన్నారు. స్వాగతం పలుకుతున్న పసుపులేటి హరిప్రసాద్‌

➡️