ప్రజాశక్తి -మాధవధార : రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఈశ్వరరావు తెలిపారు. కంచరపాలెం పైడిమాంబ కాలనీ దోబీఘాట్ వద్ద సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రజకులకు రక్షణ చట్టం చేయాలని, 50 ఏళ్లు పైబడిన రజకులకు పెన్షన్ మంజూరు చేయాలని, దోబీఘాట్స్ నిర్మించాలని డిమాండ్చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు చేపట్టే ధర్నాను జయప్రదంచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.లక్ష్మి, కె.ఉమ, కె.రమణ, కె.పరదేశి, కె.వసంతలక్ష్మి, కె.ఈశ్వరరావు పాల్గొన్నారు.