ప్రజాశక్తి – కడప అర్బన్ నగరంలోని పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు ఈనెల 25 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్నామని దర్గా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం దర్గాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. అందుకోసం అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) కమిటీ సభ్యులు, జిల్లా యం తాంగం అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధుల సమన్వ యంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. నగర పాలక సంస్థ వారి సహకారంతో పారిశు ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శానిటేషన్ చేస్తున్నారని తెలిపారు. ఉరుసు ఉత్సవ ఏర్పాట్లను ఒక్కొశాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉరుసు మహోత్సవాలలో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన దర్గా కమిటీ సమావేశ తీర్మానం మేరకు ఈనెల 27న కడప నగరంలో పాఠశాలలకు స్థానిక సెలవుగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశంలో పెద్ద దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు,శిష్య కోటి బందం పాల్గొన్నారు.