ప్రజాశక్తి-అయినవిల్లి
‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమ ంలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హిమన్ష్ శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ‘జగనన్నకు చెబుదాం’ (స్పందన) కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు తో గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ఈ సంద్భంగా అయిన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అని ఫిర్యాదుదారులు రెండోసారి రావాల్సిన అవసరం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 75 ఫిర్యాదులు అందాయని వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో జెసి శ్రీవాస్ నూపుర్ అజరు కుమార్, ఆర్‌డిఒ ఎం.ముక్కంటి, డిఎల్‌డిఒ ప్రభాకర్, మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ, ఎంపిడిఒ వెంకట చార్యులు మండల అదికారులు పాల్గొన్నారు. వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా