నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలి

Nov 23,2023 20:55

ప్రజాశక్తి-కడప అర్బన్‌ అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిసెంబర్‌ 8న నిర్వహించే నిరవధిక సమ్మె జయప్రదం చేయాలని సిఐ టియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. గురువారం సిఐటియు జిల్లా కార్యాల యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు అనుబంధ జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ అసోస ియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు టి. చెన్నమ్మ, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌ టి యు రాష్ట్ర అధ్యక్షురాలు టి.గంగావతి ప్రసంగించారు. అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అంగ న్వాడీ లందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరారు. రిటై ర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేతనాలు పెంచుతానన్నా ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ నీటి మీద రాతలుగా మిగిలిపోయిందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్స్‌ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సెంటర్లు పర్యవేక్షణ పేరుతో ఫుడ్‌ కమిషనర్‌, ఎంఎస్‌కె, తహశీల్దార్‌, ఎంపిడిఒ రాజకీయ నాయకులు ఇలా అనేకమంది విజిట్ల పేరుతో అవమానిస్తూ వేధింపులు గురి చేస్తున్నారన్నారు. సమ్మెకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌. నాగ సుబ్బారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్‌, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ కేసి.బాదుల్లా, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఉద్దె.మద్దిలేటీ, సిఐటియు నగర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌ డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, 5వ జిల్లా కార్యదర్శి ఐ.ఎన్‌. సుబ్బమ్మ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమావేశంలో సిఐటియు, సిఐటియుసి ఐఎఫ్‌ టియు అనుబంధ అంగన్వాడీ సంఘ నాయకులు లక్ష్మీదేవి, సుబ్బమ్మ, అంజలి, మేరీ, శాంతి, యశోద, లసన్న, వసుంధర, వరలక్ష్మి, అరుణ, విజయలక్ష్మి, విజయమ్మ, శ్రీదేవి, మంజుల, సరస్వతి, శోభ, నరసమ్మ, శివమ్మ , మల్లేశ్వరి, వాసంతి, విజరు, కుమారి, నాగ తులసి, కులాయమ్మ, నాగమణి, ఓబులమ్మ, సుభద్ర పాల్గొన్నారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న యూనియన్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మిదేవి

➡️