నాసా ప్రాజెక్టుకు’శ్రీచైతన్య’ విద్యార్థులు

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన 9 మంది విద్యార్థులు నాసా ప్రాజెక్ట్‌ తయారీకి ఎంపికయ్యారు. అందులో భాగంగా పాఠశాలలో ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడు బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు ఆసక్తి కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. దీనివల్ల విద్యార్థుల్లో సజనాత్మక, ఆలోచనా శక్తి మెరుగు పడుతుందన్నారు. నాసా ప్రాజెక్టు గురించి వివరించి విద్యార్థులను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్‌ బి.లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రాజెక్టు, విధివిధానాలు, గతంలో శ్రీ చైతన్య సాధించిన విజయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్‌ఆర్‌.శ్రీనివాసరావు, నాసా ప్రాజెక్టు ఇన్‌ఛార్జి లింగారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నాసా ప్రాజెక్టుకు ఎంపికైన విద్యార్థులు

➡️