ప్రజాశక్తి-రాజానగరంజిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 169 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభిచినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్‌భరత్ తెలిపారు. మండలంలోని కొండగుంటూరులో ఆర్‌బికెను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులు బుధవారం సందర్శించారు. రికార్డులను, డేటా ఎంట్రీ వివరాలను, తేమ శాతం తనిఖీ, బరువు కొలిచే విధానం, రికార్డుల నిర్వహణ, రశీదు జారీ గురించి టెక్నికల్ అసిస్టెంట్, వ్యవసాయ సహాయకులను అడిగారు. అనంతరం రైతులతో కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడారు. కొనుగోళ్లు జరిపిన 24 గంటల్లోగా నగదు రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 231 అర్‌బికెల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు చేపడతామని ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కోతలు ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేసి, ఆయా గ్రామాల పరిధిలోని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. 167 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించడం జరిగిందని క్షేత్ర స్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు, పంచాయతీ కార్యదర్శి పర్యటించి రైతుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మిల్లర్ల నుంచి వత్తిడి లేదని, అదనపు డబ్బులు ఏమి అడగడం లేదని జెసి రైతులు తెలిపారు. పొలం వద్దకు లారీ వచ్చి సేకరిస్తున్నట్టు వాహనానికి జిపిఎస్ ట్రాకింగ్ పరికరం ఏర్పాటు చేసినట్లు డ్రైవర్ కలెక్టరుకు తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో డిఎం పౌర సరఫరాలు ఎ.కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవ రావు, తహశీల్దార్ పవన్ కుమార్, పంచాయతీ, సచివాలయ సిబ్బంది, రైతులు చిలకలపూడి శ్రీను, నసింశెట్టి చక్రరావు, కొలమూరి లోవరాజు, పిన్నికి నాగేశ్వరరావు, చిలకలపూడి వాసు పాల్గొన్నారు.