ప్రజాశక్తి-పామూరు కనిగిరి మాజీ ఏఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్‌ను శుక్రవారం పామూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ సహకార బ్యాంకు చైర్మన్ వై ఎం ప్రసాద్‌రెడ్డి(బన్నీ) పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై మెరుగైన వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో స్వగ్రామానికి తిరిగి వచ్చిన సందర్భంగా సమాచారం తెలుసుకున్న జంకే వెంకటరెడ్డి, బన్నీ దారపనేనిని పరామర్శించారు. దారపనేని చంద్రశేఖర్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా స్వగ్రామానికి తిరిగి రావడం చాలా ఆనందదాయకమని వారు తెలిపారు. సిఎస్పురం మండలం అయ్యవారిపల్లె సర్పంచ్ ముత్యాల భారతి నారాయణరెడ్డి, పామూరు మండల వైసీపీ సీనియర్ నాయకులు వివేక, ఒమేగ విద్యాసంస్థల కరస్పాండెంట్ కల్లూరి రామిరెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు.