తూనికలు,కొలతల మోసాలపై జాగ్రత్త

Nov 27,2023 23:30 #legal metrology, #palnadu district

పల్నాడు జిల్లా: తూనికలు కొలతల మోసాలపట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని లీగల్‌ మెట్రాలజీ పల్నాడు జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఎన్‌.అల్లురయ్య అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరవుపేట రెడ్డి నగర్‌ లో గల శారద జూనియర్‌ కళాశాలలో సోమవారం పల్నాడు జిల్లా విని యోగదారుల సంఘం ఏంజెల్‌ ప్రైడ్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్‌ మెట్రాలజీ పల్నాడు జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఎన్‌.అల్లురయ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన కలిగి వుండాలని వస్తువులు కొనుగోలు సమయంలో తూనికలు, కొలతల విషయంలో అప్ర మత్తంగా ఉండాలన్నారు. తప్పుడు తూకం రాళ్లతో మోసం చేస్తారని , తూకం రాళ్ల వెనుక భాగాన లీగల్‌ మెట్రాలజీ విభాగం వారు 2 ఏళ్లకు ఒకసారి వేసే ముద్ర వున్నదీ లేనిది చూసుకోవాలన్నారు. వినియోగ దారుల వ్యవహారాలు, ఆహార,పౌరసరఫరాల శాఖ కమిష నర్‌ వినియోగదారుల అవగాహన నిమిత్తం తయారుచేసిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ ముప్పాళ్ల శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞనారాయణ, మహిళ అధ్యక్షు రాలు పి.సౌజన్య, జాయింట్‌ సెక్రటరీ షేక్‌ షాముల్ల పాల్గొన్నారు.

 

 

➡️