డిసెంబర్‌ 4న చలో ఢిల్లీకి తరలి రండి

Nov 27,2023 23:08
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న

ప్రజాశక్తి – కాకినాడ

దళిత హక్కులు, సామాజిక న్యాయ సాధనకై ఈ ఏడాది డిసెంబర్‌ 4న నిర్వహిస్తున్న చలో ఢిల్లీకి వేలాదిగా తరలిరావాలని వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం( కెవిపిఎస్‌) నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం సుందర య్య భవన్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం సీనియర్‌ నాయకులు మోర్త రాజశేఖర్‌ మాట్లా డుతూ డిసెంబర్‌ 4న దళిత హక్కులు, సామా జిక న్యాయసాధనకై రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చేందుకు ఢిల్లీలో నిర్వహిస్తున్న మహాధర్నాలో వేలాదిగా ప్రజలు పాల్గోని జయప్రదం చేయాలన్నారు. దళిత సమస్యల పరిష్కా రానికి రూపొందించిన డిమాండ్స్‌ను ఈసందర్బంగా వివరిం చారు. భారత రాజ్యాంగానికి ముప్పు తలపెట్టిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మా దానికి వ్యతిరేకంగా, భారత లౌకిక రాజ్యాంగాన్ని కాపాడు కునేందుకు ఢిల్లీలో దళిత సోషణ ముక్తి మంచ్‌, అఖిల భారత వ్యవసాయ కార్మిక సం ఘం, ఇతర దళిత, గిరిజన, యువజన సంఘాలు ఈ కార్య క్రమాన్ని తలపెట్టా యన్నారు. ఈ మహా ధర్నాలో ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ, దేశంలో యువతీ యువకులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని, ప్రయివేటీకరణను వ్యతిరే కిస్తూ ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో రిజర్వే షన్లు అమలు చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని సమర్థవం తంగా అమలు చేయాలని, 41 సిఆర్పీ నోటీసు ఇచ్చే విధానాన్ని ఉపసంహరిం చుకోవాలని, సబ్‌ ప్లాన్‌ చట్టానికి విధించిన కాలపరిమితిని తొలగించి పటిష్ట చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. చరిత్రను వక్రీకరించే ఆర్‌ఎస్‌ ఎస్‌ విద్యా విధానం దేశానికి నష్టమని, యువతలో సనాతన, శాస్త్రీయ భావా లను రుద్ధే ప్రయత్నం చేస్తున్న ఆర్‌ఎస్‌ ఎస్‌ చర్యలను వ్యతిరేకించి రాజ్యాంగానికి రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్ర మంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, దళిత సంఘాల నాయ కులు ఎం.కృష్ణమూర్తి, బచ్చల కామేశ్వ రరావు, తుమ్మల నూకరాజు, బయ్య కుమార్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె..సింహాచలం, వ్యవసా య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడీ ఈశ్వరరావు, ఐద్వా రాష్ట్ర నాయకురాలు సిహెచ్‌ .రమణి, కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఊబ బుల్లబ్బాయి, అదృష్ట దీపుడు, కె.సత్యా నందం, పద్మనాభం పాల్గొన్నారు.

 

➡️