డిజిటల్‌ అక్షరాస్యత నైపుణ్యత అవసరం

ప్రజాశక్తి-కడప అర్బన్‌ డిజిటల్‌ ప్రపంచంలో సాంకేతికతపై అవగాహన, నైపుణ్యతను పెంచుకోవడం తక్షణ కర్తవ్యమని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రఘునాధరెడ్డి అన్నారు. బుధవారం విశ్వవిద్యాలయ కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ సభ్యులు డాక్టర్‌ వేపరాల లాజర్‌, మైనారిటీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రియా జున్నీసా, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-4 ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎస్‌.సునీత, డాక్టర్‌ కె.లలిత సంయుక్త ఆధ్వర్యంలో ”ప్రస్తుత కాలంలో డిజిటల్‌ అక్షరాస్యత ప్రాము ఖ్యత” యువతలో ఆరోగ్య ప్రమాద ప్రవర్తనగా హెచ్‌ఐవి ఎయిడ్స్‌” అనే అంశంపై నిపుణులతో ఉపన్యాస కార్యక్రమం వైవీయూలో నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపల్‌ ఎస్‌.రఘునాథరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి మహానగరాల వరకు వ్యాపారకలాపాలు ఆన్‌లైన్‌ ప్రపంచంలోనే డిజిటల్‌ అక్షరాస్యతలో భారతదేశ, ఉండడం గర్వించదగ్గ పరిణా మమని పేర్కొన్నారు. విద్యా రంగంలో డిజిటల్‌ విధానం అమలవుతోందని ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తూ భవిష్యత్తులో రాణించాలంటే డిజిటల్‌ లిటరసీ అవసరమని పేర్కొ న్నారు.”ప్రస్తుత కాలంలో డిజిటల్‌ అక్షరాస్యత ప్రాముఖ్యత” అనే అంశంపై రిసోర్స్‌ పర్సన్‌గా హాజరైన కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ, హక్ద ర్శక్‌-నాస్కామ్‌ ఫౌండేషన్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఎన్‌.నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజల్ని ఇంటికే పరిమితం చేసిన ప్రత్యామ్నాయంగా డిజిట లైజేషన్‌ అలవాటు పడ్డామని తెలిపారు. ఈ విధానం వల్ల వనగూరే ప్రయో జనాలను ఉదాహరణలతో వివరించారు. ఆధునిక సాంకేతికతను, డిజిటల్‌ విధానాన్ని అందిపుచ్చుకోకపోతే పోతామన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బీమా పథకాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తూ అందులో నమోదు కావాలని విద్యార్థులకు సూచించారు. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనై జేషన్‌ కన్సల్టెంట్‌ షేక్‌. ఇంతియాజ్‌ అహ్మద్‌ ” యువతలో ఆరోగ్య ప్రమాద ప్రవర్త నగా హెచ్‌ఐవి ఎయిడ్స్‌” అనే అంశంపై మాట్లాడారు. హెచ్‌ఐవి పుట్టుక, వ్యాధి వ్యాప్తి, యువత విలువల జీవన విధానం గురించి అవగాహన కల్పించారు. బీమా నమోదుకు ప్రత్యేక కార్యచరణ కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బీమా నమోదుకు విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని విశ్వ విద్యాలయ విసి ఆచార్య చింతా సుధాకర్‌ పేర్కొన్నారు. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ, హక్దర్శక్‌-నాస్కామ్‌ ఫౌండేషన్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఎన్‌. నాగేశ్వర్‌ రావు, షేక్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ విశ్వవిద్యాలయ విసి మర్యాదపూర్వకంగా కలిశారు. సందఠంగా విద్యార్థులకు బీమా నమోదు విషయంపై చర్చించారు. త్వరలోనే విద్యార్థుల కోసం డ్రైవ్‌ ద్వారా బీమా నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. ఆయా సంస్థల ప్రతినిధులను వీసీ ఆచార్య సుధాకర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య అభినందించారు.

➡️