డిఇఒ పోణంగి పాఠశాలను ఆకస్మిక తనిఖీ

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

జిల్లా విద్యాశాఖాధికారి పులపర్తి శ్యాంసుందర్‌ మంగళవారం ఏలూరు రూరల్‌ మండలం ఎంపిపిఎస్‌ పోణంగి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంగ్రహణాత్మక మదింపు పరీక్షలు జరుగుచున్న విధానాన్ని, అదేవిధంగా అన్ని తరగతుల సాధన బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, కరెక్షన్‌, తరుల్‌ ప్రోగ్రాం ప్రోగ్రెస్‌ కార్డ్స్‌, విద్యార్థుల ప్రగతిని, టీచర్‌ అటెండెన్స్‌ ఆన్లైన్‌లో, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తదనంతరం విద్యార్థులతో ఇంట్రాక్ట్‌ అయి విద్యార్థులు చెప్పిన సమాధానం బట్టి సంతృప్తి వ్యక్త పరచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుల రాంబాబు, ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు షేక్‌ ముస్తఫా అలీ పాఠశాలకు దాతల సహకారంతో ప్రహరీ గోడ, గేటు, వెనకవైపు ఫెన్సింగ్‌, కంప్యూటర్స్‌, ప్రింటర్‌ మొదలైనవన్నీ సమకూర్చామని, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఏలూరు స్మార్ట్‌ సిటీ లయన్స్‌ క్లబ్‌ వారు విద్యార్థులకు నోట్స్‌లు, మౌలిక వసతులు కల్పిస్తున్నారని వివరించారు. పాఠశాల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడంలో, పాఠశాల మౌలిక అభివృద్ధిలో ఉపాధ్యాయులు తీసుకున్న శ్రద్ధ శక్తుల పట్ల డిఇఒ హెచ్‌ఎం, ఉపాధ్యాయులను అభినందించారు.

➡️