ప్రజాశక్తి-మదనపల్లె రాబోయే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ముస్లిం మైనార్టీలు కృషి చేయాలని పలువురు నాయకులు అన్నారు. శనివారం స్థానిక ఎన్విఆర్ కల్యాణ మండపంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల ముస్లిం మైనార్టీల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న భూ దందాలు మాఫియా ముస్లిం మైనార్టీలకు ఏమాత్రం న్యాయం చేయలేదని తెలిపారు. టిడిపి వైపు ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనా యించడం వంటి వాటిపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్, టిడిపి జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్రాజు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎస్.ఎ.మస్తాన్, మాజీ సర్పంచ్ పటాన్ ఖాదర్ ఖాన్, దొరస్వామి నాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్, ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల ముస్లిం మైనార్టీ నాయకులు మౌలానా ముస్తాక్ అహ్మద్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు అలీముల్లా, అమీన్‌బాబు, నరసింహ యాదవ్, ఎస్ఎం.రఫీ, ముస్లిం మైనార్టీ నాయకులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు