మాట్లాడుతున్న మాజీ శాసనమండలి చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ
టిడిపితోనే మైనార్టీలకు భవిష్యత్తు
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:మైనార్టీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం 17 సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసి ముస్లిం మైనార్టీ సామాజిక వర్గాన్ని మోసం చేసిందని మాజీ శాసనమండలి చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు.నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్లా ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ముస్లిం నాయకుల అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళి అర్పించి దువాతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టిడిపి మైనారిటీ అధ్యక్షులు మొయినుద్దీన్ సభా అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, టిడిపి హెచ్ ఆర్ డి కమిటీ మెంబర్ ఎస్పీ సాహెబ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి హాజరయ్యారు. అనంతరం అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూమైనారిటీల కోసం తెలుగుదేశం పార్టీ 17 సంక్షేమ పథకాలను తీసుకుని వస్తే వైసిపి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందన్నారు.మైనార్టీల సంక్షేమం గురించి ప్రశ్నిస్తుంటే నవరత్నాల పేరు చెప్పి తప్పించుకుని ముస్లిం సామాజికవర్గాన్ని మోసం చేస్తున్నారాన్నరు.మైనార్టీ సామాజిక వర్గానికి రావాల్సిన నిధులు నవరత్నాలకు దారి మళ్లిస్తుంటే ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఏం వెలగబెడు తున్నరన్నారు.ముస్లిం సామాజిక వర్గ ఓట్లు చీలిపోకుండా అందరం కలిసి ఐకమత్యంతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ముస్లిం సామాజిక వర్గం ఓట్లతో వైసిపి 151 స్థానాలు గెలుచుకుందనీ, ఈసారి ఆ పరిస్థితులు లేకుండా చూడాలన్నారు. నారా చంద్రబాబునాయుడు తర్వాత నారా లోకేష్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.భవిష్యత్తులో అబ్దుల్ అజీజ్‌కు దేశ స్థాయిలో పేరు వచ్చే విధంగా పదవి ఇచ్చి రాష్ట్రం లో ఉన్న 60 లక్షల మంది ముస్లిం ప్రజానీకానికి సహకారం అందించే బాధ్యత పెట్టనున్నారన్నారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప మరెవరు కాపాడలేరన్నారు. ముస్లిం సమాజంలో చేతివత్తుల పనులవారు చిరు వ్యాపారస్తులు అధికంగా ఉన్నారనీ, వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సబ్సిడీతో వ్యాపారాలకు సహకరిస్తున్నట్టు మైనారిటీలకు కూడా 50శాతం సబ్సిడీతో పరిశ్రమల ఏర్పాటుకు కోటి రూపాయలు రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టెలా చూస్తామన్నారు.సమస్యలను చంద్రబాబు దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కషి చేద్దామన్నారు.రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడం ఖాయమన్నారు.చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత తెలుగుజాతిపై ముస్లిం సమాజంపై ఉందన్నారు. ముస్లిం సమాజం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి చంద్రబాబే అన్నారు.జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందనీ రాష్ట్ర ఖజానాన్ని దోచుకొని దాచు కొని ,రాజకీయాలే అజెండాగా పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జాఫర్ షరీఫ్, హయాద్ బాషా, నన్నే సాహెబ్, రఫీ, ఖాదర్ భాషా, సాబీర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.