‘టిఆర్‌ఆర్‌’లో రాజ్యాంగ దినోత్సవం

Nov 25,2023 20:19
మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ రవికుమార్‌

మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ రవికుమార్‌
‘టిఆర్‌ఆర్‌’లో రాజ్యాంగ దినోత్సవం
ప్రజాశక్తి-కందుకూరుకందుకూరు టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఐక్యుఎసి ఆధ్వర్యంలో నవంబర్‌ 26ను పురస్కరించుకుని రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, స్ఫూర్తి, లక్ష్యాలను తెలియజేసే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎం రవి కుమార్‌ మాట్లాడుతూ రాజ్యాంగ పరిణామ క్రమాన్ని సింహవలోకనం చేసి, రాజ్యాంగ విలువలు, లక్ష్యాల గురించి విద్యార్థులకు వివరించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏడుకొండలు నరేంద్ర ప్రసంగిస్తూ విద్యార్థులందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యుఏసి కోఆర్డినేటర్‌ రాజగోపాల్‌ బాబు మాట్లాడుతూ ప్రస్తుత రాజ్యాంగ పనితీరు, పాలకుల యొక్క జవాబు దారితనం, సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల యొక్క హక్కులు మరియు విధులు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంకా రాజనీతి శాస్త్ర అధ్యాపకులు కోటపాటి నరేష్‌ రాజా ప్రసంగించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివి, ప్రతిజ్ఞ చేశారు. కళాశాలలోని అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️