ప్రజాశక్తి – ఆరిలోవ : జూనియర్ దళపతి పేరు గల నీటి ఏనుగుకు 6వ జన్మదిన వేడుకలు ఆదివారం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో సందర్శకుల మధ్య ఘనంగా నిర్వహించారు. 2017లో జూ పార్కులో జన్మించిన జూనియర్ దళపతికి ఇష్టమైన పుచ్చకాయ, అరటి పండ్లు, క్యారెట్, ఇతర కూరగాయలతో రూపొందించిన ప్రత్యేక కేక్‌ను జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా కట్ చేసి, దళపతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేక్‌ను ఆహారంగా జూనియర్ దళపతికి అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాలనాయుడు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు భారతి, రాజేశ్వరరావు, ఎడ్యుకేషన్ బృందం సభ్యులు పాల్గొన్నారు.