ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం
జీవ శాస్త్ర ఉపాధ్యాయులకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు సముదాయ సమావేశం గురువారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు 60 మంది పాల్గొని శిక్షణ పొందారు. ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి-2 బి.రాములు పాల్గొని ఉపాధ్యాయులకు సమ్మెటివ్ పరీక్షల నిర్వహణపై సూచనలు అందించారు. సబ్జెక్టు సముదాయ చైర్పర్సన్ స్థానిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోవకుమారి ఉపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలను గురించి, విద్యార్థులకు బోధించే విధానంపై పలుసూచనలు చేశారు. రిసోర్స్పర్సన్గా బుట్టాయగూడెం ఉన్నత పాఠశాల జువాలజీ ఉపాధ్యాయులు జి.గంగాధర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డిసెంబర్ నెలకు సంబంధించిన పాఠ్యాంశాలపైన బోధనోపకరణాలను తయారు చేశారు. పదో తరగతి పరీక్షల గురించి ప్రణాళిక తయారు చేశారు.