జిల్లా జైలును తనిఖీ చేసిన డిఎల్‌ఎస్‌ఎ సెక్రెటరీ

Nov 29,2023 21:10

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి బుధవారం జిల్లా కారాగారాన్ని, జిల్లా కారాగారంలో ఉన్న లీగల్‌ సర్వీసెస్‌ క్లినిక్‌ను సందర్శిచారు. ఉచిత న్యాయ సహాయానికి అర్హులైన ఖైదీలు అర్జీ పెట్టుకుంటే వారికి ఉచిత న్యాయ సహాయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందజేస్తుందని తెలియ చేశారు. తర్వాత వంటశాలను పరిశీలించి ఖైదీలకు అందే ఆహారాన్ని చూసి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జైలు సూపరింటెండెంట్‌, ఇతర అధికారులకు ఖైదీల బాగోగుల గురించి తగు సూచనలు తెలియచేశారు.కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్సె కౌన్సెల్‌ ఐ.మధుబాబు , ఇతర జైలు అధికారులు, ఖైదీలు పాల్గొన్నారు.

➡️