ప్రజాశక్తి – ప్రొద్దుటూరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రొద్దుటూరుకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాల యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ పట్టణంలో నిర్మాణదశలో ఉన్న పలు అబివృద్ధి పనుల గురించి వివరిస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో మొదలుపెట్టనున్న రహ దారుల పనుల గురించి తెలిపారు. రాజుపాలెం మండలం సోమాపురం గ్రామస్తులు తమ వ్యవసాయ పనులకు పోవాలంటే వాగు దాటి వెళ్లాల్సి ఉంటుందని, ప్రతి సంవత్సరం ఈ వాగులో నీరు వేగంగా ప్రవహిస్తుంటుందన్నారు. వాగు దాటి వెళ్లాలంటే మహిళా కూలీలు, మహిళా రైతులు తీవ్ర అసౌకార్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించారన్నారు. సోమాపురం అర్కటవేముల రైతులతో మాట్లాడి భూమిని సేకరించి రూ.1.10కోట్ల అంచనా వ్యయంతో పనులు పూర్తి చేశామన్నారు. 40రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల వెనకవైపు నరహరిపురం రోడ్డు సమస్య పరిష్కరించామన్నారు. రూ.50లక్షలతో పనులు పూర్తి చేస్తామన్నారు. మీనాపురం మీదుగా కల్లూరు-చెన్నమరాజుపల్లె వరకు 16కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు రూ.9.40కోట్లు, రాజు పాలెం మీదుగా చెన్నమరాజు పల్లె- గాదెగూడూరుకు రూ.6.12కోట్లు, పెన్నానది మీదుగా పొట్టిపాడు-కుమ్మరపల్లె వరకు 12కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు రూ.4.10కోట్లు మంజూరు చేయించామని పేర్కొ న్నారు. త్వరలో పనులు ప్రారంభి స్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 95కిలోమీటర్ల మేర రూ.43.45 కోట్లతో తారు రోడ్లు పట్టణ ప్రాంతంలో రూ.94కోట్లతో 657రోడ్డు కాలువల పనులు పూర్తి చేశామన్నారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి బాగలేదని చెప్పడం టిడిపి నాయకులకు తగదని పేర్కొన్నారు. వారు ధృత రాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. తానెప్పుడూ అభివృద్ధి, సంక్షేమంతోనే కనిపి స్తానన్నారు. గతంలో టిడిపి నాయకులు ఈ అభివృద్ధిని ఎందుకు చేయలేకపోయారని ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లకిëదేవి, కౌన్సిలర్లు వరి కూటి ఓబులరెడ్డి, ఇర్ఫాన్‌బాషా పాల్గొన్నారు.