ఛలో ఢిల్లీని జయప్రదం చేయండి

Dec 1,2023 00:28

ప్రజాశక్తి-పిసిపల్లి: అసమానతల్లేని నూతన సమాజ సాధన కోసం ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పెదచెర్లోపల్లి మండల కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం ప్రకారం బడ్జెట్లో కేటాయించి నిధులను సక్రమంగా అమలు ఖర్చు చేయకుండా దళితుల వెనుకబాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ దుష్ట బుద్ధిని వ్యక్తపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పి మహేష్‌, సిహెచ్‌ తిరుపాలు, విశ్రాంత విఆర్‌ఒ చొప్పరపు బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్‌ వై విజరుకుమార్‌, జి అడివయ్య, టి రత్నం, అంకయ్య, నీలం అనిల్‌, కె కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️