ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపాలనకు వ్యతిరేకంగా. దళిత హక్కులు సామాజిక న్యాయసాధనకై డిసెంబర్ 4న ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు అన్నారు. కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి ఇచ్చే వినతిపత్రంపై మాజీ ఎంపి జివి.హర్షకుమార్, మాజీ మంత్రి కెఎస్ జవహార్, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ ఐక్యవేదిక ఛైర్మన్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ అజ్జరపు వాసు సంతకాలు చేసి చలో ఢిల్లీకి మద్దతు ప్రకటించారని తెలిపారు. 75 యేళ్ళ స్వతంత్ర భారత దేశంలో నేటికీ దళితులపై అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు. మానభంగాలు సాగుతూనే ఉన్నాయని, మణిపూర్ మారణ హోమంలో మనువాదుల చేతుల్లో ఇద్దరు అమ్మాయిల్ని నగంగా ఊరేగించి అత్యాచారం చేయడం యావత్ భారత్ దేశం తల దించుకునేలా చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.