ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్రం బాగుపడాలంటే ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌రావు తెలిపారు. జనం కోసం జనార్ధన్, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని నగరంలోని 5వ డివిజన్ (గోపాల్ నగర్)లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్ధన్‌రావుకు డివిజన్ నాయకులు, మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం జనార్ధన్ ఇంటింటికీ వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. టిడిపి మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు అత్యవసరమన్నారు. ఈకార్యక్రమంలో కొఠారి నాగేశ్వరావు, కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, షేక్ కపిల్ బాషా, డివిజన్ అధ్యక్షుడు ఆవుల శ్రీను, కొనంకి శ్రీనివాస్, మంచాల వెంకటేశ్వర్లు, మంచాల శ్రీనివాసులు, బొల్లినేని వాసు కష్ణ, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : స్థానిక ఇజ్రాయేల్ పేటలో బాబుష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందజేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తోటా మహేష్ నాయుడు, చేదూరి లక్ష్మయ్య, వార్డు మెంబర్ చేదూరి కిషోర్, కొర్రపోలు యోహాన్, చేదూరి వెంకట్ పాల్గొన్నారు. కొమరోలు : కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీ పరిధిలోని కంకరవాని పల్లె గ్రామంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఇంటింటికీ తిరిగి వైసిపి ప్రభుత్వ వైఫ్యలాల గురించి ప్రజలకు వివరించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బోనేని వెంకటేశ్వర్లు, మట్టమల్ల మోషే, పోనేని వెంకటేశ్వర్లు, వారదమ్మ, యాకోబు, రత్నం ,దానిమ్మ, పుల్లయ్య, యోహాన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.