ప్రజాశక్తి-కనిగిరి: రాష్ట్రంలో వైసీపీ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు చంద్రన్న పాలన రావాలని బలంగా కోరుకుంటున్నారని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం కనిగిరి మండలం బల్లిపల్లి పంచాయతీలో మన ఊరు-మన ఉగ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాసు హరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 63 కుటుంబాలు టీడీపీలో చేరారు. విశ్వనాథపురం ఎస్టి కాలనీ వాసులు 30 కుటుంబాలు, పుల్లాయపల్లి ఎస్టి కాలనీలో 13 కుటుంబాలు, తమటంవారిపల్లిలో 2 కుటుంబాలు, బల్లిపల్లి ఎస్సీలు 18 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పరిశపోగు ఆనందరావు, కుమ్మరికుంట ఏసేబు, పరిసపోగు అంకయ్య, యాకోబు, వెంగయ్య, పబ్బిరాజు కొండయ్య, పెద్దన్న, బాలయ్య, కొమ్మి కొండయ్య, ఇండ్ల వెంకమౌళి, రాపూరి నరసయ్య, కొమ్మి సుబ్బయ్య, నరసయ్య, తదితరులు చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ ఒకసారి అవకాశం ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి సంక్షేమం పేరుతో సంక్షోభ పాలన సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. లక్ష్మిరెడ్డి, జగన్, కొండు కొండయ్య, కోతంశెట్టి చిన్నబ్బారు, రమేష్, సుందరయ్య, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.