ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్ -రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్తా శ్రమించాలని టీడీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. నా బూత్-నా బాధ్యత కార్యక్రమంలో భాగంగా రాచర్ల పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్‌ఛార్జులు, టీడీపీ, జనసేన ముఖ్య నాయకుల సమావేశంలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ఎంతో కీలకమైనవని, అశ్రద్ధ వహించకుండా బూత్ ఇన్‌ఛార్జులు, టీడీపీ, జనసేన నాయకులు సమిష్టిగా పని చేయాలని కోరారు. ప్రతి బూత్‌లో మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని, డబుల్ ఓటర్లను, డెత్ ఓటర్లను గుర్తించి, దొంగ ఓట్లకు అవకాశం లేకుండా చూడాలని కోరారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రతీ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ప్రతీ బూత్‌లో టీడీపీ, జనసేన ఓటు బ్యాంకును బలోపేతం చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను మన వైపు మరల్చుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల పంచాయతీకి చెందిన బూత్ ఇన్‌ఛార్జులు, టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.