ప్రజాశక్తి-ఉప్పలగుప్తంబాల్య, బలవంతపు వివాహాలు గృహ హింసను కలిసికట్టుగా వ్యతిరేకిస్తామంటూ ఉప్పలగుప్తంలో సోమవారం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జెండర్ హింసకు వ్యతిరేకంగా జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సమాన విద్య ఎదుగుదల కోసం సమాన అవకాశం కల్పిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు ముడకల లక్ష్మి, వెలుగు ఎపిఎం, జి.భూపతి వర్మ, సిసి బి.సత్యనారాయణమ్మ, విఒఎలు పాల్గొన్నారు.