గుంటూరు: గుంటూరు ఛానల్‌కు వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని కోరుతూ అఖిలపక్ష గుం టూరు ఛానల్ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లా డుతూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేసి నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని కలెక్టర్ ని కోరారు. ఓ చిన్న ప్రాజెక్టు కోసం 80 సంవత్స రాలుగా ఆ ప్రాంత ప్రజానీకం ఆందోళన చేయటం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 15 తర్వాత అవార్డు పాస్ చేసి భూసేకరణ కోసం నిధులు విడుదల చేస్తా మని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గుంటూరు ఛానల్‌కి నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని చెప్పినట్లు కలెక్టర్ చెప్పారు. రైతుల కోరిన విధంగా నిపుణుల కమిటీ వేసి వాళ్ళ సందేహాలను కూడా తీర్చామన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో అఖిలపక్ష గుంటూరు ఛానల్ సాధన సమితి నాయకులు పాశం రామారావు, నరిశెట్టి ఆచార్యులు, కుర్రా హరి బాబు, కంచుమాటి అజరు కుమార్, కాకుమాను నాగే శ్వరరావు, ఈమని అప్పారావు, బైర గాని శ్రీనివాసరావు, బొల్లేపల్లి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.కొనసాగుతున్న నిరసన దీక్ష పెదనందిపాడు గుంటూరు ఛానల్ పొదిగింపునకు నిధులు కేటా యించాలని కోరుతూ పెదనందిపాడులో నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్ష బుధవారంతో 10వ రోజుకు చేరుకుంది. బుధవారం నిరసన దీక్షను మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ ప్రారంభించారు, వారు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంత ప్రజలు గుంటూరు ఛానల్ పొడ ిగింపును కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చిన ఇంతవరకు అమలులోకి రాలేదన్నారు, నీరు ఉంటేనే అభివద్ధి సాధ్యమవుతుందని, నీటి కోసం రైతులు, ప్రజలు పోరాడాల్సి రావటం ప్రభుత్వాలకు సిగ్గుచేటు అన్నారు, వెంటనే గుంటూరు ఛానల్ పొడిగింపునకు అవసరమైన నిధులను మంజూరు చేసి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ నిరసన దీక్షలో నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు కొల్లా రాజమోహన రావు, నాయకులు యార్లగడ్డ అంకమ్మ చౌదరి, ముద్దన రాఘవయ్య, దాసరి శేషగిరిరావు, కొల్లా రామన్, ముద్దన నగరాజకుమారి, ఈదర భ్రమరాంబ, కొల్లా నిర్మల తదితరులు పాల్గొన్నారు.