గిరి చిత్రాలు అద్భుతం : డిప్యూటీ సిఎం

ప్రజాశక్తి- రాజంపేట అర్బన్‌ గిరిధర్‌ వేసిన చిత్రాలు అత్యద్భుతమని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా పేర్కొన్నారు. నాయని గిరిధర్‌ జిఎంసి కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన చిత్రకళ ప్రదర్శనను తిలకించేందుకు విచ్చేసిన అంజాద్‌బాషా ఆ చిత్రాలు చూసి ఆహ్లాద భరితుడయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చిత్రంలోనే అనేక భావాలను స్ఫురింపజేస్తున్న గిరిధర్‌ చిత్రకళ నైపుణ్యత అమోఘమని అన్నారు. ఇంతటి ప్రతిభావంతుడు ఉమ్మడి జిల్లాలలో ఉండడం గర్వకారణమని తెలిపారు. గిరిధర్‌ నైపుణ్యానికి తగిన విధంగా తాను కోరిన ప్రాంతంలో ప్రదర్శన ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామని అన్నారు. ప్రతి చిత్రంలో ఓ సందేశం ఉండటంతో పాటు సహజత్వం ఉట్టిపడుతోందని అన్నారు. ఈ చిత్రాలు చూసిన తర్వాత మనసు ప్రశాంతమైందని తెలి యజేశారు. కార్యక్రమంలో ఆయనతోపాటు మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీని వాసులు రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మర్రి రవి, మిరియాల సురేఖ, శ్రీ చైతన్య ప్రిన్సిపల్‌ ఆకేపాటి సుధాకర్‌ రెడ్డితో పాటు, చిత్రకళా ప్రదర్శనను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కళాభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.శ్మశాన వాటిక అభివద్ధికి నిధులు మంజూరు చేయాలి ముస్లిముల శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేయాలని ఆదివారం డిప్యూటీ సిఎం అంజాద్‌బాషాకు ముస్లిమ్‌ మైనార్టీలు వినతి పత్రం అందజేశారు. ఆదివారం స్థానిక జిఎంసి కల్యాణ మండపంలో చిత్ర కళా ప్రదర్శన సందర్శనార్థం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషకు రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జాహిద్‌ అలీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని కారంపల్లి పంచాయతీలో ముస్లిములకు ప్రభుత్వం ద్వారా నూతనంగా మంజూరు చేసిన ముస్లిం శ్మశాన వాటికకు నిధులు మంజూరు చేసి అభివద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల కో -ఆప్షన్‌ సభ్యులు గౌస్‌, కౌన్సిలర్‌ న్యామతుల్లా, పట్టణ మైనారిటీ అధ్యక్షులు మసూద్‌ అలీ, మున్నా పాల్గొన్నారు.

➡️