క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి

Dec 1,2023 22:56
వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు:
నగరంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంతోపాటు క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది.శుక్రవారం నగర డిప్యూటీ కమిషనర్‌ను డివైఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ నగర్‌ నగర కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర లో యువకులు ఆడడానికి ఇప్పటికే సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారని కానీ ఆ క్రీడాకారులు ఆటలల్లో నైపుణ్యం సంపాదించుకొనేందుకు క్రీడా మైదానాలు చూపలేదని, అదే సమయంలో కిట్లను అందజేయలేదన్నారు.అటువంటి పరిస్థితుల్లో క్రీడాకారులు ఆటల పోటీలల్లో ఎలా రాణిస్తారని, కనీసం క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేసుకోవడానికి అనువైన క్రీడా మైదానాలు నగర పరిధిలో లేవన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సాప్‌ ద్వారా క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేస్తుండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం సాఫ్‌లను నిర్వీర్యం చేసిందన్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేని సంఘాల ద్వారా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని ఇది క్రీడాకారులను మోసం చేయడమే నన్నారు. తక్షణమే నగర పరిధిలో ఉన్న ప్రతి డివిజన్లో ఒక క్రీడా మైదానం ,ఒక ఇండోర్‌ స్టేడియం, నగర నియోజకవర్గం పరిధిలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున క్రీడాకారులను సమీకరించి ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు తిరుపతి, జగదీష్‌ ,నగర సహాయక కార్యదర్శి శేఖర్‌, సుబ్బరాయుడు ,మణి, నాగేంద్ర ,జీవ ,మధు తదితరులు పాల్గొన్నారు.3

➡️