ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్
క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్’ఆడుదాం ఆంధ్ర’ టోర్నమెంట్‌లో భాగంగా వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, ఖోఖో ఆటలలో పాల్గొనదలచిన వారు 27వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు సచివాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆత్మకూరు ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ తెలిపారు. ఈ టోర్నమెంట్లో 15 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరూ ఈ క్రీడలలో పాల్గొనవచ్చన్నారు. పోటీలలో పాల్గొన దలచిన వారికి ఒక్కొక్కరు రెండిటికీ మించి పాల్గొనకుడదనే నిబంధనను అనుసరించి రిజిస్ట్రేషన్ల చేసుకోవలని తెలిపారు. పురుషులకు, మహిళకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తామన్నారు. కావున ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీ నుండి ప్రతి సచివాలయ పరిధిలో విజేతలను మండలస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ప్రభుత్వమే అవసరమైన ఆట వస్తువులను సమకూర్చడం జరుగుతుందని, కాబట్టి ఔత్సహిక యువతి యువకులందరూ పాల్గొనాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులదరూ పాల్గొన్నారు.