పల్నాడు జిల్లా: కోటప్పకొండ గిరి ప్రదర్శనకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని పల్నాడు జిల్లా అడవి శాఖాధికారి ఎన్ .రామచంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అరుణాచలం గిరిప్రదక్షిణ తరహాలోనే గిరిప్రదక్షిణపై గైడ్ మ్యాప్‌తో కూడిన సమాచార బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్గంలో కొత్త రఫ్ గ్రానైట్ బెంచీలు, గిరి బాల విహార్ పార్క్, మరుగుదొడ్లు సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. గిరిప్రదక్షిణ మార్గంలో భద్రతను పటిష్టం చేసేందుకు నైట్ వాచ్‌మెన్‌ని నియమించారు. గిరి బాల విహార్ వద్ద ,గిరిప్రదక్షిణ దారిలో సుందరీకరణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.