ఫొటో : ఉచిత వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది
కృష్ణంపల్లిలో ‘కాకర్ల’ వైద్య సేవలు
ప్రజాశక్తి-ఉదయగిరిమండల పరిధిలోని కృష్ణంపల్లిలోని సచివాలయం వద్ద 192వ రోజు శుక్రవారం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ సంజీవని ఆరోగ్య రథంతో అనారోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. 165 మందిని డాక్టర్లు వివిధ ఆరోగ్య సమస్యలు పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం టిడిపి నాయకులు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్ వైద్య శిబిరాన్ని సందర్శించి అందిస్తున్న వైద్య సేవలను గ్రామస్తుల నుండి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత వైద్య సేవలు అందిస్తున్న కాకర్ల సురేష్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.