రెడ్‌క్రాస్ ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి
ప్రజాశక్తి – ఏలూరు
అర్బన్‌విద్యార్థి దశ నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని, చదువుతోపాటు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాల మీద కూడా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి సూచించారు. స్థానిక పత్తేబాద్‌లోని రెడ్‌క్రాస్ ఎఎన్‌ఎం నర్సింగ్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన 27వ బ్యాచ్ విద్యార్థినులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యూఎస్‌ఎ నుంచి వచ్చిన గుర్రాల బాల చిన్నపురెడ్డి, భవ్య రెడ్డిలు విద్యార్థినులకు పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం భవ్య రెడ్డి మాట్లాడుతూ ఎఎన్‌ఎం కోర్స్ తర్వాత బిఎస్‌సి నర్సింగ్ చదువుకోవడానికి ఆసక్తి ఉన్న పేద విద్యార్థినీలను పూర్తి ఖర్చులతో చదివిస్తానన్నారు. గతంలో విద్యార్థినుల హాస్టల్‌కు కావలసిన ఐరన్ మంచాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ స్టాఫ్ జి.జ్ఞాన వేణి, సిహెచ్.అనూష, ఎ.సూర్యనారాయణ, వి.నాగరాజు, ఎండి.సుధీర్ పాల్గొన్నారు.