ప్రజాశక్తి- కనిగిరి : కనిగిరిలో ట్రాఫిక్ సమస్యను తీర్చేలా జాతీయరహదారి 565 పట్టణ బైపాస్‌ను పూర్తిచేసేలా ఆదేశాలు ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సత్య నారాయణరెడ్డి మాట్లాడుతూ గత కొద్ది నెలల నుంచి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. స్పందించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు సమస్యను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు. డివిజన్ కేంద్రం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వివిధ పనులు నిమిత్తం కనిగిరి రావడంతో నిత్యం ట్రాఫిక్ జాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలిగండ్ల జడ్పిటిసి గుంటక తిరుపత రెడ్డి, కనిగిరి జడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి, వైసిపి నాయకులు వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి, ములే గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.