వానపల్లి పోలీస్‌ని పరామర్శిస్తున్న మాజీ ఎంఎల్‌ఎ వనమ
ప్రజాశక్తి-కాకినాడ
కాకినాడ నగరంలో 4 వ డివిజన్ ఆదివారం స్థానిక టిడిపి నాయకులు వానపల్లి పోలీస్, వానపల్లి జ్యోతి, నమశ్శివాయ, వడిసల దాలమ్మ తదితరులు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించార. వారు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అయితే స్థానిక వైసిపి నాయకులు కంపర బాబి, బల్ల సూరిబాబు, తన అనుచరులతో కలిసి టిడిపినేతలపై దాడి చేసి వారిని నిర్బంధించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనకు చేరుకొని దాడిలో గాయపడిన వానపల్లి పోలీస్‌ను జిజిహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న టిడిపి కార్యకర్తలను మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఎంఎల్‌ఎ ఆరాచకాలు మితిమీరాయన్నారు. ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉంటున్న డివిజన్‌లో టిడిపికి సంబంధించి ఎటువంటి ప్రచారం చేయరాదంటూ దాడి చేయడం దారుణమన్నారు. రాజ్యాంగ దినోత్సవం నాడు రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను వైసిపి నాయకులు కాల రాయడం ఘోరమన్నారు. మాజీ ఎంఎల్‌ఎ వెంట టిడిపి నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, పంతాడి రాజు, గుమ్మల్ల చిన్నా తదితరులు ఉన్నారు.
వానపల్లి పోలీస్‌ని పరామర్శిస్తున్న మాజీ ఎంఎల్‌ఎ వనమ