కన్నతల్లినే కడతేర్చాడు..

ప్రజాశక్తి – చీరాల : మద్యానికి బానిసైన కుమారుడు ఆస్తి విషయంలో గొడపడి కన్నతల్లినే విచక్షణా రహితంగా కత్తి పొడిచి కడతేర్చాడు. ఈ ఘటన చీరాల మండలం పుల్లాయిపాలెంలో మంగళవారం చోటు చేసుకుంది. అందిన వివరాల ప్రకారం… మండలంలోని పుల్లాయిపాలెంలో నివాసముంటున్న నక్కల వీరయ్య, వెంకటరత్నం దంపతులకు ఇద్దరు కుమారులు, కుమారై ఉన్నారు చిన్న కుమారుడు గతంలో మతి చెందాడు.పెద్ద కుమారుడు శివయ్య వివాహం చేసుకొని అదే గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటరత్నం ఇటీవల బ్యాంకు నుంచి లోను తెచ్చుకొని ఇల్లు కట్టుకుంది. అందుకు ప్రతి నెలా బ్యాంకుకు కిస్తీలు కట్టాల్సి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా బ్యాంకు కిస్తీలు కట్టడం వెంకటరత్నంకు కష్టతరంగా మారింది. దీంతో తమ కున్న 3 ఎకరాల పొలంలో అర ఎకరం అమ్మి ఇంటి బాకీ తీర్చేందుకు ఆమె సిద్ధమయ్యింది. విషయం గురించి ఆమె కుమారుడు శివయ్య తెలియటంతో పొలం అమ్మకుండా అడ్డుపడ్డాడు. ఈ క్రమంలో ఆస్తి విషయమై తల్లి కొడుకుల మధ్య స్వల్ప విభేదాలు ఏర్పడ్డాయి. కిస్తీలు చెల్లించాలని బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి పెరగటంతో పొలం అమ్మాలని వెంకటరత్నం నిర్ణయించుకుంది. పొలం అమ్మటం ఇష్టంలేని శివయ్య మద్యం తాగి వచ్చి మంగళవారం తల్లితో ఘర్షణ పడ్డాడు.చివరకూ మాట మాట పెరగడంతో చివరకూ శివయ్య విచక్షణ కోల్పోయి కత్తితో తన మెడపై దాడి చేశాడు. దీంతో ఆమె కుప్ప కూలిపోయి అక్కడికక్కడే మతి చెందింది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న సిఐ సోమశేఖర్‌ ఘటనా స్థలానికి చేరుకొని మతదేహాన్ని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మదేహాన్ని పోస్టుమార్టం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి చేతిలో హత్యకు గురైన వెంకటర్నం

➡️