కండువా కప్పుతున్న ఎంఎల్ఎ
పలువురు టిడిపిలో చేరిక
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్, నక్కలగుంటకు చెందిన రాబర్ట్ వారి మిత్రబందంతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికీ పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వందలాది మంది యువకులు నాకు అండగా ఉండేందుకు తెలుదేశం పార్టీలో చేరిన వారందరిని పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తున్నానన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే. తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికి అన్నిరకాలుగా నా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్, టీడీపీ నాయకులు పోతురాజు రవి, పంబాడి డేవిడ్ రాజు, శీను, సాయి, యుగంధర్, శంకర్, వినరు, గిరీష్, నారాయణ పాల్గొన్నారు.