రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న డిఆర్‌ఒ సత్తిబాబు
ప్రజాశక్తి-అమలాపురం ప్రజాసామ్య వ్యవస్థలు అంచెలంచెలుగా ఏర్పడి పరిడవిల్లేందుకు ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో డిఆర్‌ఒ చాంబర్ నందు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబి తా సంక్షిప్త సవరణ లోని పురోగతిని ఆయన వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా కచ్చితత్వంతో రూపొం దించేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నా యని. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సవరణ ప్రక్రియలో తమ వంతు భాగస్వా మ్యం వహించి ప్రక్రియ సజావుగా జరగ డానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సవరణ ప్రక్రియలో ఒకే డోర్ నెంబర్లులో పదిమంది ఓటర్లు పైబడి ఉన్నట్లయితే వారిని సర్వే ద్వారా గుర్తించి వేరే డోర్ నెంబరు కేటాయిస్తారన్నారు.కొత్తగా అర్హులైన మరియు వదిలివేయబడిన ఓటర్లను చేర్చడం జాబితా సవరణ యొక్క ప్రాథమిక లక్ష్యమని, ప్రత్యేక ఓటరు జాబితా సంక్షిప్త సవరణ 2024లో ఓటర్ల జాబితాలో ఏదైనా తప్పుగా చేర్చడంపై అభ్యంతరాలను తెలపవచ్చునన్నారు. జనవరి 1, 2024 నాటికి లేదా అంతకు ముందు 18 సంవత్సరాలు పూర్తి చేసిన లేదా పూర్తిచే సుకున్న వారు ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జనవరి 5న ఓటర్ల జాబితా తుది ప్రచురణ చేస్తారన్నారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు 2024 సార్వత్రిక ఎన్నికలకు జనవరి 1, 2024తో అర్హత తేదీగా ఓటర్ల జాబితాల సంక్షిప్త సవరణను నిర్వహిస్తు న్నట్లు తెలిపారు ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు, సవరణ కోసం దరఖాస్తులు డిసెంబర్ 9 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఓటర్ జాబితా భారత ఎన్నికల సంఘం మార్గద ర్శకాలు అనుగుణంగా జరుగుతున్నది లేనిది పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు యువరాజ్ (పరిశ్రమల శాఖ కమిషనర్) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకం, కచ్చితత్వంతో క్షేత్రస్థాయిలో జరుగు తున్నది లేనిది పరిశీలిస్తారన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా పంచాయతీల పరిధిలో కేంద్రం విడుదల చేసిన నిధులు వినియోగంపై కేంద్రం ఆర్థిక సంఘ సంచాలకులు శోభిత గుప్తా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సందేహాలను నివత్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం తరపున కారం వెంకటేశ్వరరావు, బిజెపి తరఫున డి.రాజేష్, టిడిపి తరఫున అల్లాడి స్వామి నాయుడు, వైసిపి తరఫున షేక్ అబ్దుల్ ఖాదర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున యార్లగడ్డ రవీంద్ర, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.