కారంపూడి: ఓటరు విద్య, ఓటరు అక్షరాస్యత పెంపొం దించుకోవడంపై అవగాహన కల్పించాలని తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎన్నికల శాఖ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక తాహసిల్దార్ కార్యాలయం నుండి సిష్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ ర్యాలీ కార్యక్రమమును నిర్వహించారు. మార్పులు, చేర్పులు ఉంటే డిసెంబర్ రెండవ తేదీ నుండి మూడవ తేదీ వరకు సంబంధిత బూతు స్థాయి అధికారులను సంప్రదించి అర్జీ దాఖలు చేసుకోవాలని చెప్పారు. ర్యాలీలో మండల స్పెషల్ ఆఫీసర్ జి. జోసఫ్ ఈ ఓ పి ఆర్ డి సత్య ప్రసాద్, డిప్యూటీ తహ శీల్దార్ కీర్తి సుధా స్రవంతి పాల్గొన్నారు.