వినుకొండ: ఓటమి భయంతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బిఎల్‌ఓ లను, ఎన్నికల అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి టిడిపి సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బి ఎల్ వోలను, అధికారులను తన ఇంటికి, కళ్యాణ మండపానికి పిలిపించుకొని తమకు అనుకూలంగా పనిచేయకపోతే బదిలీ చేయిస్తానని బెదిరిస్తూ టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించి, దొంగ ఓట్లు చేర్చేందుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో స్థానికంగా నివాసముంటున్న సుమారు 6,000 మందికి ఓట్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఒక వ్యక్తి ఓట్ల తొలగింపునకు 5 దరఖాస్తులు మించి పెట్టకూడదని నిబంధన ఉన్నప్ప టికీ వైసిపి నాయకులు వందల సంఖ్యలో ఫారం-7 దరఖాస్తు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు వారికి అనుకూలంగా వ్యవ హరిస్తున్నారని విమర్శించారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరులో సర్పంచ్ మహిళా చిన్న వీరయ్య వ్యక్తి పేరు పై 350 ఓట్లు తొలగించేందుకు ఫారం -7 దరఖాస్తు చేశారని ఆధారాలతో వివరించారు. శావల్యాపురం మండలంలోని అనేక గ్రామాల్లో టిడిపి సానుభూతి పరుల ఓట్లు తొలగించారన్నారు. ఓట్ల తొల గింపు పై అధికారిని నిలదీస్తే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు, వైసిపి నాయకులు అధికారులకు కూడా కులాన్ని ఆపాదించడం దుర్మార్గమైన చర్య అన్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు పరామర్శ కరెంటు తీగల తగిలి వారి శరీరం కాలి పోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులను పల్నాడు జిల్లా టిడిపి అధ్య క్షులు మాజీ ఎమ్మెల్యే జివి ఆంజ నేయులు శుక్ర వారం పరా మర్శించారు. పన్నెండు రోజుల క్రితం వినుకొండలోని రెడ్డినగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు రిషిత, పావన, శ్రీ హర్షిత లు డాబాపై ఆడుకుంటుండగా మెయిన్ లైన్ కరెంట్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారుల వైద్యం కోసం రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.