ప్రజాశక్తి -భామిని : నెల రోజులుగా భామిని మండలంలో ఇసుకగూడ, సన్నాయిగూడ, కాజీపురం, మూలగూడ, పసుకుడి, లివిరి ప్రాంతాలలో సంచరించిన నాలుగు ఏనుగుల గుంపు ఒడిశా సరిహద్దుకు చేరింది. శనివారం వంశధార నదిని దాటి ఒడిశాలో కాసినగర్ బ్లాక్, బుదరా పంచాయతీ, వన్నా గ్రామ పరిసర జీడి తోటల్లో ఏనుగులు తిష్టవేశాయి. వారం రోజులుగా పసుకుడి, లివిరి, పసుకుడి గ్రామాల్లో సంచరించిన ఏనుగులు.. ప్రస్తుతం నది దాటి ఒడిశాలోకి ప్రవేశించాయి. ఒడిశా వెళ్లడంతో స్థానిక వ్యవసాయ దారులు తాత్కాలిక ఉపశమనంగా భావిస్తున్నారు.