ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: ఎయిడ్స్ బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా తాను కూడా అండగా ఉంటానని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఎయిడ్స్ బాధితులు, వివిధ పాఠశాలల విద్యార్ధులకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత కలెక్టరేట్ నుంచి జిజిహెచ్ వరకు నిర్వహించిన అవగాహనా ర్యాలీని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాధితుల వివరాలను స్వచ్ఛంద సంస్థలు తన దష్టికి తీసుకువస్తే వారికి అవసరమైన సహాయం వ్యక్తిగతంగా తాను కూడా చేస్తానన్నారు. అనంతరం బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. శ్యాంబాబు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎస్. రాజ్యలక్ష్మి, జిల్లా క్షయ, ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, డిఐఒ పద్మజ, జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ, డిపిఎం వాణీశ్రీ, టిబి డిపిసి రత్నకుమారి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ప్రభాకర్ పాల్గొన్నారు.బాపట్లలో ర్యాలీబాపట్ల: ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా సూచించారు. శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం నిర్వహించిన ఎయిడ్స్ నియంత్రణ అవగాన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఎస్.విజయమ్మ, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టిబి కంట్రోల్ అధికారి సి.వి.రమాదేవి, వివిధ విభాగాల వైద్యాధికారులు సయ్యద్ జానీభాషా, షేక్ సాధిక్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి బిఎస్ నారాయణబట్టు పాల్గొన్నారు.