ఎయిడ్స్‌ నివారణపై అవగాహన

Dec 1,2023 22:58
ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్ధులు

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్ధులు
ఎయిడ్స్‌ నివారణపై అవగాహన
ప్రజాశక్తి-కందుకూరు:కందుకూరు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా, ఎన్‌.ఎస్‌.ఎస్‌ ఒకటి , రెండో యూనిట్లు, రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ , జంతు శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ నివారణపై అవగాహన సదస్సు , ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం లెట్‌ ద కమ్యూనిటీస్‌ లీడ్‌ అనే ఇతివత్తంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్‌ పై అవగాహన సదస్సులను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌ నిర్మూలన స్థితి ఎలా ఉంది, కౌమార దశ బాల బాలికలకు ఎయిడ్స్‌ గురించి అవగాహన ఎందుకు ఉండాలి, ఎయిడ్స్‌ నిర్మూలనలో యువత పాత్ర, ఎయిడ్స్‌ నియంత్రణపై ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా ఎలాంటి అవగాహన ఉండాలి వంటి అంశాలపై వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులకు తెలియజేశారు. అవగాహన కార్యక్రమం అనంతరం సమాజంలోనూ మార్పు తీసుకురావడానికి కలశాల విద్యార్థులు అధ్యాపక బందం ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఏడుకొండలు నరేంద్ర, ఐక్యుఏసి కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.రాజగోపాల్‌ బాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ మొదటి యూనిట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ కోటపాటి నరేష్‌ రాజా, ఎన్‌ఎస్‌ఎస్‌ రెండో యూనిట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చీరాల శంకర రావు, డాక్టర్‌ ఐ.అనూష, డాక్టర్‌ షేక్‌ షానాజ్‌ బేగం, డాక్టర్‌ తిరుపతి స్వామి, ఇతర అధ్యాపక బందం, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.2

➡️