ఎయిడ్స్‌ నియంత్రణకు సమిష్టి కృషి

సమిష్టి కృషి

ప్రజాశక్తి-యంత్రాంగం హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, జెఎన్‌టియుకె విసి డాక్టర్‌ ప్రసాద్‌ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎయిడ్స్‌ బాధిత చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కమ్యూనిటీ లంచ్‌ ఏర్పాటు చేశారు. డిఎం హెచ్‌ఒ డాక్టర్‌ జె.నరసింహ నాయక్‌, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ స్వప్న, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్య కుమారి, జిల్లా ఎయిడ్స్‌, లెప్రసీ అధికారి డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, మేనేజర్‌ జి.ఆదిలింగం పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. శంఖవరం రిఫరల్‌లో ఛైర్మన్‌ ఎన్‌.ష్లస్సర్‌ బాబు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. గండేపల్లి ఆదిత్య డిగ్రీ, పిజి కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో రామేశ్వరంపేటలో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్‌ విలాస్‌ అనిల్‌ చవాన్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ పివి.నాగేశ్వరావు, బి.కె.విద్యాసాగర్‌, బివిఎస్‌ఎస్‌.ఉదయనాథ్‌ పాల్గొన్నారు. పెద్దాపురం ఆర్‌డిఒ కార్యాలయం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంఎల్‌ఎ ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ విజయ శేఖర్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ అనూష, డివియల్‌ అప్పలకొండ, వైజ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డి.రాజు, డైరెక్టర్‌ జయ పాల్గొన్నారు.

➡️