‘ఎయిడ్స్’పై ప్రజల్లో జాగృత ర్యాలీలుప్రజాశక్తి-తిరుపతి(మంగళం), యంత్రాంగంతిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాల జాతీయ సేవా విభాగం, ఉమెన్ ప్రొటెక్షన్, ఉమెన్ ఎంపవర్మెంట్ విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొని తిరుపతి నగర పరిధిలోని మెటర్నిటీ హాస్పిటల్ వద్ద నుండి ప్రారంభమై శ్రీ వెంకటేశ్వర ఆడిటోరియం వరకు ర్యాలీగా వెళ్తూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలను జాగతి పరచడానికి నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ కె.జయచంద్ర, జాతీయ సేవ విభాగం ఆఫీసర్ యెస్.చక్రిశ్రీధర్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్స్ మునిశంకర్, డి.పూర్ణచంద్రరెడ్డి, కన్వీనర్స్ టి.చంద్రకళ ,గ్రీష్మ, వాలంటీర్స్ పాల్గొన్నారు.పాకాలలో.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యులు డాక్టర్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మాసిలమని, అధ్యాపకులు చిట్టి కళావతి, రమేష్ కుమార్, మాధవి, ఆదిశంకర్ రెడ్డి పాల్గొన్నారు.రేణిగుంటలో… తిరుపతికి చెందిన జఫన్యా కాలేజీ ఆఫ్ నర్సింగ్, ఒవిఆర్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ సంయుక్తంగా నర్సింగ్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కరస్పాండెంట్ డాక్టర్ వి.విజయ భాస్కర యాదవ్, త్రిపురాదేవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో నర్సింగ్ ప్రిన్సిపాల్ శ్రీజ మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, ఎయిడ్స్ రోగుల పట్ల సానుభూతి ఉండాలని, అంటరానివారిగా వారిని చూడరాదని అన్నారు. కళాశాల డైరెక్టర్ డా.సి. రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ కు మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కళాశాల ఎఓ డా.ఎం. తంగరాజన్, రేణిగుంట సర్పంచ్ నగేష్ పాల్గొన్నారు. చిన్నగొట్టిగల్లులో… వైద్యాధికారి డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో భాకరాపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ హెచ్‌ఐవిని ఎయిడ్స్‌గా అభివృద్ధి చెందకుండా ఆపగలిగే అవకాశం సరైన మందులతో ఉందన్నారు. పేదలకు గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు, చికిత్స ఇస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో విద్యార్థుల ర్యాలీ