సత్తెనపల్లి టౌన్ : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ జూనియర్‌కాలేజీలో హెల్ప్ పౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సభను నిర్వహించారు. సభకు కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు అధ్యక్షత వహించారు . ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపివో శ్రీలత మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, కొన్ని అజ్రాగత్తల వలన ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ఎయిడ్స్ నాలుగు రూపాల్లో మనిషిలోకి ప్రవేశిస్తుందని అన్నారు. సురక్షితం కానీ లైంగిక సంబంధ ద్వారా, పరీక్షలు చేయని రక్త మార్పిడి కారణంగా, కలుషితమైన నీడిల్స్ వాడకం వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందు తుందని చెప్పారు. ఈ దేశ సంపద యువతేనని, ఎయిడ్స్ పట్ల పూర్తి అవ గాహన కల్గి ఉండాలని సూచించారు. మానవాళి మనుగడకు ప్రశ్నార్థకగా మారిన ఎయిడ్స్‌పై ఎన్నో అపోహలు , అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ‘అసమానతలను నిర్మూలిద్దాం, ఎయిడ్స్ ను అంతమొం దిద్దాం’ అనే నినాదంతో ప్రచారం నిర్వ హించి యువతను చైతన్యం పరుస్తోందని అన్నారు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం బాధ్యత నేటి యువతపై ఉంద న్నారు. కార్యక్రమంలో హెల్ప్ పౌండేషన్ అధ్యక్షులు కంచెర్ల బుల్లిబాబు, అదనపు సిడిపివో సంతోషి కుమారి పాల్గొన్నారు. త ఈపూరు: మండల కేంద్రమైన ఈపూరులో ని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్యా ధికారులు సిబ్బందితో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ వై.లక్ష్మి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసు కోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే,ఎయిడ్స్ వ్యాధి సోకిన వారిపట్ల ప్రజలు సేవా భావం కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు కమ లాకర్, రాంబాబు,శ్రీనాథ్, కాంత్,మాధవి, సునీత,హేమలత, ఐ సి టి సి కౌన్సిలర్ నాగరాజు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.