ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : ఉద్యోగులకు పని ప్రదేశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు సర్వీసుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దష్టి సారించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్‌.శ్రీలత తెలిపారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఃఎంప్లాయీస్‌ గ్రీవెన్స్‌ః కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు నెలకోసారి ఎంప్లాయీస్‌ గ్రీవెన్స్‌ను నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ఉద్యో గులు ఇచ్చిన ఆర్జీలను పరి శీలించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆమె సూ చించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి చిరంజీవి, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.అర్జీలు స్వీకరిస్తున్న డిఆర్‌ఒ ఆర్‌.శ్రీలత

➡️