ప్రజాశక్తి-టంగుటూరు : స్థానిక పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో స్మార్ట్‌విజన్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం నిర్వహించారు.ఈ వైద్యశిబిరం మూడురోజులపాటు నిర్వహించనున్నారు.తొలి రోజు కంటి వైద్య నిపుణులు డాక్టర్ నాగ మాధురి, వైద్య సిబ్బంది 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసమరైన విద్యార్థులకు కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తాజా ఆకు కూరలు, విటమిన్ ఎ, పాలు ఆహారంలో ఎక్కువగా తీసుకోలన్నారు. ల్యాప్ టాప్స్, కంప్యూటర్లు అధికంగా వినియోగించరాదన్నారు. కంప్యూటర్ వినియోగం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య సిబ్బంది విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల హెల్త్ వాచ్ కమిటీ కో ఆర్డినేటర్ పి.బ్రహ్మం, కళాశాల కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్, ప్రిన్సిపల్ జివికె. మూర్తి, స్టూడెంట్స్ డీన్ వీరాంజనేయులు, ఎఒ రమణబాబు, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.